Thursday, February 13, 2025
Homeనేషనల్Bengaluru: నో వర్క్ ఫ్రమ్ కార్.. పోలీసులు వార్నింగ్

Bengaluru: నో వర్క్ ఫ్రమ్ కార్.. పోలీసులు వార్నింగ్

కొంతమంది ఉద్యోగులు అర్జెంట్ వర్క్ అంటూ రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తూనే వర్క్ చేయడం చూసే ఉంటాం. అయితే బెంగళూరు(Bengaluru)లో ఓ మహిళ మాత్రం కారు డ్రైవ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అదే సమయంలో తీవ్ర వివాదాస్పదం అవుతుంది. బెంగళూరులోని ఆర్టీ నగర్‌ ప్రాంతంలో ఓ మహిళ కారు డ్రైవ్‌ చేస్తూనే ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

దీంతో ఆ మహిళ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ కారు ప్రమాదానికి గురైతే ఆ మహిళ కారణంగా ఇతరులు కూడా ప్రమాదానికి గురికావాల్సి ఉంటుందని మండిపడుతున్నారు. అంతా ఎమర్జెన్సీ వర్క్ అయితే కారు పక్కన పార్క్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఆ మహిళకు జరిమానా విధించారు. రూ.1000 జరిమానా విధించడంతో పాటు ఆ మహిళను అదుపులోకి తీసుకున్న వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(work from home) అనేది ఇంటి నుంచి చేయాలే కానీ ఇలా పబ్లిక్ లో కారు డ్రైవ్‌ చేస్తూ కాదు అని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News