Thursday, February 13, 2025
Homeచిత్ర ప్రభLavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలని ఉంది.

Lavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలని ఉంది.

ఇటీవల కాలంలో ప్రముఖ హీరో రాజ్ తరుణ్.. పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేసింది.. అతని మాజీ ప్రేయసి లావణ్య. అయితే తాజాగా లావణ్య మరో సారి వార్తల్లోకి ఎక్కింది. రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె తెలిపింది. తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇకపై తన పోరాటం మస్తాన్ సాయిపై ఉంటుందని ప్రకటించింది.

- Advertisement -

రాజ్ త‌రుణ్-లావ‌ణ్య కేసులో మ‌స్తాన్ సాయి అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. మ‌స్తాన్ సాయి వ‌ల‌నే రాజ్ త‌రుణ్ త‌న‌కు దూర‌మ‌య్యాడ‌ని లావణ్య తెలిపింది. తన ప్ర‌యివేట్ వీడియోల‌తో పాటు ఎంతోమంది అమ్మాయిల ప్ర‌యివేట్ వీడియోల‌ను తీసి మ‌స్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని లావ‌ణ్య పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇవ్వ‌డంతో అత‌డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంత‌రం అత‌డికి రిమాండ్‌కు త‌ర‌లించ‌గా.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.

ఇదిలావుంటే పోలీసుల విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు తెలుస్తుంది. మ‌స్తాన్ సాయి అమ్మాయిల న‌గ్న వీడియోలే కాకుండా డ్రగ్స్ పార్టీలు కూడా చేసుకున్నట్లు బయటపడింది. వీకెండ్ పార్టీల‌లో మస్తాన్ సాయి ఇంట్లో జరిగే డ్రగ్స్ పార్టీలకు యువతీయువకులు పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో డ్రగ్స్ బయటపడటంతో నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు మ‌స్తాన్ సాయి వ‌ల‌న త‌న జీవితం నాశ‌నం అయ్యింద‌ని తెలిపింది లావ‌ణ్య.

రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న లావ‌ణ్య మాట్లాడుతూ.. ‘రాజ్‌త‌రుణ్‌కి సారీ చెప్పాలి అనుకుంటున్నా. అత‌డు ఇక్క‌డే ఉంటే అత‌డి కాళ్లు ప‌ట్టుకుని క్షమాపణలు అడిగేదాన్ని’ అని తెలిపింది. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుడదని.. తన జీవితం నాశనం అవ్వ‌డానికి మ‌స్తాన్ సాయి అత‌డి ఫ్యామిలే కారణమని వాపోయింది. మ‌స్తాన్ త‌ప్పు చేస్తున్నాడు అని చెప్పిన కూడా అత‌డికే స‌పోర్ట్ చేశారు. రాజ్‌త‌రుణ్‌తో నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని ఎలా వ‌చ్చాడో తెలియ‌దు. మ‌స్తాన్ సాయి వ‌చ్చినప్ప‌టి నుంచే మా మ‌ధ్య గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయంటూ లావ‌ణ్య తెలిపింది. రాజ్ తరుణ్ కుటుంబానికి కూడా ఈ సందర్భంగా లావణ్య క్షమాపనలు చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News