Sunday, February 23, 2025
HomeదైవంAP: రాష్ట్రోత్సవంగా ప్రభల తీర్థాన్ని ప్రకటించాలి

AP: రాష్ట్రోత్సవంగా ప్రభల తీర్థాన్ని ప్రకటించాలి

400 ఏళ్లుగా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత-సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని అభ్యర్థించారు.

- Advertisement -

4 లక్షల మంది భక్తులను

400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోత్సవం ప్రతీ ఏటా 4 లక్షల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తూ, కోనసీమ ప్రాంతపు సంప్రదాయాలకు, ప్రజా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ కూడా ఈ ఉత్సవాన్ని ప్రశంసించారని తేజస్వి పొదపాటి తెలిపారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కి సమర్పించామని వారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని, కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆయన పూర్తి అంకితభావంతో ఉన్నారని ఆమె తెలియజేసారు.

కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం వల్ల తెలుగు సంస్కృతి పునరుద్ధరించబడటమే కాకుండా, స్థానికంగా ఘనంగా జరుపుకునే సంప్రదాయాలకు మరింత గౌరవం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు అని తేజస్వి పొదపాటి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News