మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని(Alla Nani) తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు(Chandrababu) ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

కాగా వైసీపీలో కీలక నేతగా, జగన్‌కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని.. గతేడాది ఆగస్టులోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వైద్యారోగ్యశాఖ మంత్రిగా ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
