Sunday, February 23, 2025
Homeచిత్ర ప్రభUpasana: వాలంటైన్స్ డే.. రామ్‌చ‌ర‌ణ్ సతీమణి ఉపాస‌న పోస్ట్ వైరల్

Upasana: వాలంటైన్స్ డే.. రామ్‌చ‌ర‌ణ్ సతీమణి ఉపాస‌న పోస్ట్ వైరల్

ఈరోజు వాలంటైన్స్ డే కావడంతో లవ్ బర్డ్స్ బిజీబిజీగా గడుపుతున్నారు. పార్కులు, పబ్బులు, రెస్టారెంట్లు, థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన(Upasana) వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం నెటింట్లో వైర‌ల్ అవుతోంది.

- Advertisement -

‘వాలంటైన్స్ డే అనేది 22 ఏళ్లు లేదా అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన అమ్మాయిల కోసం. ఒక‌వేళ మీరు ఆ వ‌య‌స్సును దాటిపోయి ఉంటే ఆంటీలు ద‌య‌చేసి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం కోసం వేచి ఉండండి’ అంటూ ఒక‌ స్మైలీ ఎమోజీని జోడించారు‌.

ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీతో అలరించగా.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News