అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగిన అమానుష ఘటనపై ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. యాసిడ్ దాడిలో గాయపడిన యువతి ఆరోగ్యంపై ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు
ప్యారంపల్లెకు చెందిన గౌతమిపై యాసిడ్ దాడి తనని తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. బాధిత యువతికి వైద్య సాయం అందించి అండగా నిలుస్తామన్నారు. యాసిడ్ దాడి చేసిన సైకో గణేషును కఠినంగా శిక్షిస్తామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
ప్యారంపల్లెకు చెందిన జనార్ధన్, రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమికి ఏప్రిల్ 29న ఆ యువతికి పెళ్లి నిశ్చయం అయిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గణేష్ తనను ప్రేమించాలని గౌతమి వెంటపడి వేధించేవాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గౌతమి నిరాకరించటంతో యాసిడ్ దాడి చేశాడు.
.
Lokesh: యాసిడ్ దాడిపై స్పందించిన లోకేష్
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES