ప్రస్తుతం సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా, స్మార్ట్ ఫోన్ వాడేవారు ముఖ్యంగా ఈ నేరాలకు గురవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ సైబర్ నేరాలు మరింత పెరుగుతున్నాయి. వీటి నుంచి దూరంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ వాడేటప్పుడు స్మార్ట్ పద్ధతుల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే, మీరు కూడా ఈ నేరాలకు గురవచ్చు. ముఖ్యంగా, మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపించే గ్రీన్ లైట్ ను గమనించడం అవసరం. ఇది మీ ఫోన్ హ్యాక్ అయ్యే సంకేతంగా కనిపించవచ్చు. మీరు అనుకోకుండా మీ డేటా ప్రైవేట్‌గా రికార్డు అవుతుందని ఇది సూచిస్తుంది.
ఫోన్ హ్యాకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, సైబర్ నేర గాళ్లు మీ సీక్రెట్ పాస్‌వర్డ్స్, వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి మీ స్క్రీన్‌ను రికార్డ్ చేయగలుగుతారు. వారి లక్ష్యం మీరు ఆన్‌లైన్ పేమెంట్స్, షాపింగ్ బిల్స్ లేదా టికెట్ బుకింగ్ లాంటి సేవలను ఉపయోగించినప్పుడు, మీ వివరాలను వాడి డబ్బులు దోచుకోవడం. దీంతో మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.
మీ ఫోన్ స్క్రీన్ పై గ్రీన్ లైట్ ఒక సంకేతంగా కనిపిస్తే, మీరు వాడుతున్న యాప్ ఏదైతే ఉందో అది యాక్సెస్ ఇస్తుంది అప్పుడు మీఫోన్‌లో అది మైక్ లేదా కెమెరా ఆన్ అయ్యి, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో మీ ఫోన్ రికార్డు అవుతుందని సూచిస్తుంది. ఈ గ్రీన్ లైట్ కనిపిస్తే, అది మీ ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చునని గుర్తించండి. వెంటనే స్పందించి, ఆ అప్లికేషన్లకు యాక్సెస్‌ను పరిమితం చేసి, మీ ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. కెమెరా, మైక్ కు ఎలాంటి అనుమతులు ఇచ్చి ఉన్నాయో చెక్ చేయడం ముఖ్యం. ఈ గ్రీన్ లైట్ కనిపించినప్పుడు, మీరు అప్రమత్తం కావాలి. ఆ సమయంలో, మీ ఫోన్ సెక్యూరిటీని బలోపేతం చేసి, హ్యాకింగ్ జరిగి ఉంటే, దానిని నివారించడానికి చర్యలు తీసుకోవడం చాలా అవసరం.