అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి (Acid attack)ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాని అన్నారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Advertisement -