Sunday, February 23, 2025
Homeచిత్ర ప్రభNani: హీరో నాని చేతులమీదుగా.. 'రామం రాఘవం' ట్రైలర్ లాంచ్

Nani: హీరో నాని చేతులమీదుగా.. ‘రామం రాఘవం’ ట్రైలర్ లాంచ్

ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, సన్ రిలేషన్ పై తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ అరిపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మాతగా సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ముఖ్యంగా ధన్‌రాజ్‌తో తనకు కెరీర్ మొదట్నుండి పరిచయం ఉందన్నారు. అప్పుడే అతని టాలెంట్ రేంజ్ ఏంటో తనకు తెలుసని పేర్కొన్నారు.

- Advertisement -

“అందుకే ‘రామం రాఘవం’ సినిమాని ధన్‌రాజ్ దర్శకత్వం వహించాడంటే నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు” అన్నారు. ‘ధన్‌రాజ్ కామెడీ సినిమా తీస్తాడేమో అనుకున్నాను.. అయితే ట్రైలర్ చూపించి ఎమోషనల్ డ్రైవ్‌లోకి తీసుకెళ్లాడు’ అని నాని అన్నారు. సముద్రఖని వర్క్ అంటే వ్యక్తిగతంగా తనకు ఎంతో ఇష్టమన్న నాని.. ఆయన తాను ఫ్యామిలీలా ఉంటామన్నారు. నిర్మాత పృధ్వీ పోలవరపు మంచి కంటెంట్ ఉన్న సినిమాని నిర్మించడం మంచి విషయమన్నారు. “’శశి’ సినిమాలో ‘ఒకే ఒక లోకం నువ్వు…’ పాట నాకు ఎంతో ఇష్టం” అన్నారు. ఆ సినిమాకి సంగీతాన్నిచ్చిన అరుణ్ చిలివేరు ‘రామం రాఘవం’ సినిమాకు చక్కని సంగీతాన్ని ఇచ్చారని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ 21వ తారీకు కోసం ఎదురు చూస్తున్నా అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. తన సొంత తమ్ముడులాంటి నాని ‘రామం రాఘవం’ ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ధన్ రాజు దర్శకత్వంలో ఫిబ్రవరి 21న వస్తున్న మా సినిమాని థియేటర్‌లో చూసి తమ మా టీమ్‌ని ఆశీర్వదించాలని కోరారు. దర్శకుడు ధన్‌రాజ్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ట్రైలర్‌ని హీరో నాని గారు లాంచ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. అడగ్గానే తమ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నాని గారికి కృతజ్ఞతలని తెలిపారు. ఫాదర్-సన్ ఎమోషనల్ డ్రామాలో ఇప్పటివరకు ఎవరు ట్రై చేయని యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న తమ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.

కంటెంట్ ఫుల్‌గా ఉన్న తమ సినిమా ట్రైలర్‌ను నాని గారు విడుదల చేయడం.. తమ టీమ్‌కి మరింత ఉత్సాహాన్నిచ్చిందని నిర్మాత పృధ్వీ పోలవరపు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటి ప్రమోదిని, సంగీత దర్శకుడు అరుణ్ చిలివేరు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ శివప్రసాద్ యానాల అందించగా. డి.ఓ.పి-దుర్గాప్రసాద్ కొల్లి, ఎడిటర్-మార్తాండ్. కె. వెంకటేష్, ఆర్ట్-డౌలూరి నారాయణ, పాటలు-సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News