మొబైల్‌తో ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తు ఏ స్టేజ్ లో ఉంది? ఇంటి కోసం సర్వే నిర్వహించారా లేదా? ఇల్లు మంజూరైందా ? లేదా? మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా?
- Advertisement -
ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు? వంటి వివరాలను తెలుసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దరఖాస్తుదారులు తమ పనిని మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. తన ఉన్న చోటు నుంచే దరఖాస్తు స్దితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఆధార్ నెంబర్ / మొబైల్ నెంబర్ / రేషన్ కార్డు నెంబరుతో అన్నివివరాలు తెలుసుకోవచ్చు. https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి గ్రీవెన్స్ స్టేటస్‌లోని సెర్చ్‌లోకి వెళ్లి తమ దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్‌సైట్ ద్వారానే తెలియజేసే అవకాశం కూడా ఉంది.