ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ ఆలయం(Murugan Temple)ను దర్శించుకున్నారు. కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయితో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. భక్తులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు.


అంతకుముందు మధుర మీనాక్షి అమ్మవారిని, సోమసుందరేశ్వరుడిని దర్శించుకుని చీరసారెలు, ఫల పుష్పాలు సమర్పించారు. అలాగే పళని మురుగన్ ఆలయం, తిరుప్పరకుండ్రంలో ఉన్న శ్రీ మురుగన్ స్వామి ఆలయం, తంజావూరు, కుంభకోణం, తిరుచ్చెందూర్ ఆలయాలను కూడా సందర్శించారు. ఇక కేరళలో కూడా పలు ఆలయాలను సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.


