మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2025) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగానే ఢిల్లీ విజయం సాధించిందని ముంబై ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా ధీటుగా ఆడింది.
చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఢిల్లీ బ్యాటర్ సజనా బౌండరీ వైపు షాట్ కొట్టఙంది. అయితే ఫీల్డర్ హర్మన్ ప్రీత్ బాల్ అందుకుని కీపర్ వైపు విసిరింది. కీపర్ బంతిని అందుకుని రనౌట్ చేసింది. అయితే రివ్యూలో మాత్రం బ్యాటర్ క్రీజ్‌లోకి వచ్చేటప్పటికి బెయిల్స్ మాత్రం పైకి లేవలేదు. దీంతో థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో WPL నిబంధనలు సరిగా లేవని ముంబై ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రూల్స్: ఎంసీసీ(MCC) క్లాజ్ 29.1 ప్రకారం స్టంప్స్‌ను బంతి తాకిన తర్వాత లైట్లు వెలిగినా బెయిల్స్ విడిపోయినప్పుడు మాత్రమే రనౌట్‌గా పరిగణించాలి. అయితే బెయిల్స్ పడకుండా ఉంటే మాత్రం దానిని ఔట్‌గా పరిగణించరు. ఈ రనౌట్ విషయంలోనూ ఇదే జరిగింది.