బాలీవుడ్ లో హీరోయిన్లు తమకు నచ్చిన తోడును పెళ్లి చేసుకుని, కెరీర్ ను కంటిన్యూ చేసే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ ట్రెండ్ క్లబ్ లో చేరేందుకు టాప్ హీరోయిన్ కృతి సనన్ రెడీ అయిందని ఇండస్ట్రీలో హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ కబీర్ బాహియాతో కృతి సెటిల్ అయ్యేందుకు రెడీ అయ్యారని, అందుకే ఇద్దరూ తెగ ఓపన్ గా తిరిగేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.
ఇక అఫిషియల్ అనౌన్స్మెంటే
బిజినెస్ మ్యాన్ కబీర్ తో కలిసి కృతి లంచ్ డేట్స్, డిన్నర్ డేట్స్, పార్టీలు, వల్డ్ టూర్లు కొడుతున్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన రిలేషన్షిప్ స్టేటస్ పై కృతి ఓపన్ అవుతున్నారు. వీళ్ల పెళ్లి అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయని, ఇక రేపో మాపో అఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తారంటూ రూమర్లు షికార్లు చేస్తున్న వేళ వీరిద్దరూ జంటగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. కబీర్ పేరెంట్స్ దగ్గరికి కృతి వెళ్తోందనే వార్త లీక్ కావటంతో ఇక కృతి పెళ్లి వార్త ఏ క్షణమైనా వినిపించవచ్చని తెలుస్తోంది.
నేనొక్కడినే, ఆదిపురుష్ వంటి సినిమాలతో తెలుగు వారిని ఎంటర్టైన్ చేసిన కృతి సనన్ మనవాళ్లకు కూడా ఫేవరెట్ అయ్యారు.