Sunday, February 23, 2025
HomeతెలంగాణTrain : ప్రయాణికులకు అలర్ట్.. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు దారి మళ్లింపు

Train : ప్రయాణికులకు అలర్ట్.. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు దారి మళ్లింపు

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య విజ్ఞప్తి చేసింది రైల్వేశాఖ. హనుమకొండలోని కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా అనేక రైళ్లు దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది ప్రయాణికులు దేశంలోని పలు రాష్ట్రాలకు ఇక్కడ నుండి వెళ్తుంటారు. కావునా ఈ స్టేషను నుంచి వెళ్లు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలకు సిద్దం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

కాజీపేట-విజయవాడ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ పనులు జరుగుతున్న ఈ నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్ కు దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

కృష్ణ ఎక్స్ ప్రెస్ ను రీ షెడ్యూల్
ఈ నెల 18, 19న ఆదిలాబాద్-తిరుపతి (17406) డైలీ వెళ్లే కృష్ణ ఎక్స్ ప్రెస్ ను నిర్ణీత సమయం కన్న 90 నిమిషాల తేడాతో రీ షెడ్యూల్ చేసి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

దారి మళ్ళింపు
ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు షాలిమార్-హైదరాబాద్ (18045) నెంబర్ గల షాలిమార్ ఎక్స్ ప్రెస్ (డైలీ), ముంబాయి- భువనేశ్వర్(11019) ప్రతి రోజు వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్- ముంబాయి(11020) కోణార్క్ డైలీ ఎక్స్ ప్రెస్ ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్-షాలిమార్ 18046 డైలీ వెళ్లే షాలిమార్ ఎక్స్ ప్రెస్ 19వ తేదీన షాలిమార్-సికింద్రాబాద్ (22849) వెళ్లే షాలిమార్ ఎక్స్ ప్రెస్ లను దారి మళ్ళించి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News