Sunday, February 23, 2025
HomeతెలంగాణRevanth Reddy: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ ఏటలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు.

- Advertisement -

“గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు” అని సీఎంవో కార్యాలయం ప్రకటించింది.

ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News