వరుస భూప్రకంపనలు(Earthquake) దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బీహార్‌తో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలోనూ భూప్రకంపనలు సంభవించాయి.
ఈ భూప్రకంపనలపై ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. భయాందోళనలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.