కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన్ వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మంగళవారం జైలులో ములాఖత్ కానున్నారు. బెంగళూరులో ఉన్న జగన్ మంగళవారం ఉదయం గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీని కలుస్తారు. దీంతో జైలులో వంశీ సెల్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. తోటి ఖైదీలు అక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి కేసుల నిందితులు ఉండటంతో భద్రతను ముమ్మరం చేశారు.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడుతున్నారు.