Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్Manchu Manoj: జల్లికట్టు వేడుకలో మంచు మనోజ్ సందడి

Manchu Manoj: జల్లికట్టు వేడుకలో మంచు మనోజ్ సందడి

చంద్రగిరిలో..

తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు సినీ నటుడు, టాలీవుడ్ రాక్‌ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.

- Advertisement -

టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరిస్తూ ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడంపై హీరో మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘బ్రిటీష్ కాలం నుండి ‘జల్లికట్టు’ పండుగ జరుగుతూనే ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదు. ఇక్కడ అంతా సాప్ట్‌గా ఉంటుంది. పశువుల పండగ‌గా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా, ముందుగా ఆలోచించుకుని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. పోలీస్ వారు లా అండ్ అర్డర్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉన్నారు. దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నా’’ అన్నారు. తనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికిన టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News