ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)కు ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దంపతులు, కుమారుడు దేవాన్ష్ వెళ్లిన సంగతి తెలిసిందే. త్రివేణి సంగమంలోని షాహి స్నానఘట్టంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగాదేవికి పూజలు చేసి, హారతి ఇచ్చారు. కుంభమేళాలో దేవుడి ఆశీస్సులు తీసుకున్నట్లు లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. తాజాగా నారా బ్రాహ్మణి(Nara Brahmani) సోషల్ మీడియా వేదికగా కుంభమేళా ఫొటోలను పంచుకున్నారు.
- Advertisement -
మహా కుంభమేళాలో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి అని అభివర్ణించారు. ప్రయాగరాజ్‌లో పవిత్ర స్నానం ఆచరించామని.. ఈ పవిత్రమైన గడ్డపైకి తరలివచ్చిన కోట్లాది మంది సామూహిక విశ్వాసాల నుంచి అద్భుతమైన దివ్య శక్తిని అనుభూతి చెందానని తెలిపారు.



