Friday, September 20, 2024
HomeతెలంగాణIK Reddy: దళితబంధుతో శాశ్వత ఉపాధి

IK Reddy: దళితబంధుతో శాశ్వత ఉపాధి

అట్ట‌డుగున ఉన్న దళితులు శాశ్వ‌త ఉపాధి పొంది ఆర్థిక ఎద‌గాల‌నే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ లోని బంగ‌ల్ పేట్ లో 20 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మిస్తున్న‌ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కొరకు అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలు లబ్ధి పొందే విధంగా కృషి చేస్తున్నార‌ని అన్నారు. అదే విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ద‌ళిత‌బంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ద‌ళిత‌బంధుతో అనేక మంది ద‌ళితులు ఆర్థికంగా వృద్ధి సాధించార‌ని, కూలీ నాలీ చేసుకునే రోజులు పోయాయ‌ని చెప్పారు. అనేక మంది త‌మ యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకుని త‌మ కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఉపాధి కల్పిస్తున్నార‌ని వెల్ల‌డించారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి 11 వంద‌ల యూనిట్లు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. నిరుపేద‌లైన‌ 11 వంద‌ల కుటుంబాలు ప్ర‌త్యక్ష్యంగా ల‌బ్ధిపొంద‌నున్నాయ‌ని, దీంతో ఇన్నేళ్లు ఒక‌రి ద‌గ్గ‌ర ప‌ని చేసిన ద‌ళితులు త‌మే యాజ‌మానులుగా మారి ఇంకో న‌లుగురికి ఉపాధి చూపుతున్నార‌ని వివ‌రించారు. అయితే యూనిట్ల ఎంపిక విషయంలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల‌ని, వారికి అనుభవం, ఇష్టం కలిగి ఉన్న రంగాల్లో యూనిట్లను నెలకొల్పేందుకు తోడ్పాటును అందించాల‌ని అధికారుల‌కు సూచించారు. మార్కెట్ స్థితిగతులు, లాభనష్టాల గురించి అన్ని అంశాలను ప‌రిశీలించాకే ల‌బ్ధిదారులు త‌మకో ఏది లాభ‌దాయ‌క‌మో ఆలోచించి యూనిట్ల‌ను నెల‌కొల్పాల‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News