ప్రధాని మోదీ(PM Modi) అమెరికా పర్యటన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పర్యటనలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ముందే భారత్ ప్రపంచంలోనే ఎక్కువ టారిఫ్‌లు విధస్తుందని ట్రంప్ కుండబద్ధలు కొట్టారు. దీంతో తాము కూడా భారత్‌పై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటన అనంతరం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఎగుమతులపై పన్నులు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంంది. మరోవైపు ఈ పర్యటనలో మోదీతో, ఎలాన్ మస్క్(Musk) భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత దిగ్గజ ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా(Tesla) ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇన్నాళ్లు ట్యాక్స్‌ల సమస్యల కారణంగా భారత్‌లోకి టెస్లా అడుగుపెట్టలేదు. తాజాగా 40 వేల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైన కార్లపై ప్రైమరీ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుండి 70 శాతానికి తగ్గించడంతో భారత మార్కెట్‌లోకి టెస్లా రంగప్రవేశానికి సిద్ధమైంది. ఇండియాలో మూడు చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గుజరాత్, ఏపీ, మరో ప్రాంతంలో ప్లాంట్ల ఏర్పాటుకు కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో టెస్లా ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తుంది.
ఇందులో భాగంగా టెస్లా కంపెనీ ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించింది. తన లింక్డ్ఇన్ పేజీలో కస్టమర్ ఫేసింగ్ పోస్టులతో పాటు బ్యాక్ ఎండ్ పోస్టులకు సంబంధించి పోస్టులు ప్రకటించింది.
పోస్టుల వివరాలు ఇలా..
- సర్వీస్ టెక్నీషియన్
- సర్వీస్ మేనేజర్
- ఇన్ సైడ్ సేల్స్ అడ్వయిజర్
- కస్టమర్ సపోర్ట్ సూపర్ వైజర్
- కస్టమర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
- ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
- సర్వీస్ అడ్వయిజర్
- టెస్లా అడ్వయిజర్
- పార్ట్స్ అడ్వయిజర్
- డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
- బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్
- స్టోర్ మేనేజర్