Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: సభ్యులకు సకాలంలో సమాధానాలు, పిటిషన్లకు ప్రత్యేక యాప్

AP: సభ్యులకు సకాలంలో సమాధానాలు, పిటిషన్లకు ప్రత్యేక యాప్

శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చే విధంగా మరియు వారి పిటిషన్లను సత్వరమే పరిష్కరించే విధంగా ఆన్ లైన్ ద్వారా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన ప్రత్యేక యాప్ ను త్వరలో రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డిని కోరారు.

- Advertisement -

బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు మరియు పోలీస్ అధికారులతో వేరు వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సరైన సమాదానాలను అందజేయడం మరియు పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ పలు శాఖల వారీగా పెండింగ్ లో నున్న స్టార్డు, అన్ స్టార్డు మరియు షార్టు నోట్ ప్రశ్నలను వివరిస్తూ వాటన్నింటికీ సకాలంలో సరైన సమాధానాలను అందజేసి జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. గౌరవ సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడుగుతుంటారని, ఆ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసినట్లైతే, ఆ వివరాలను తమ నియోజక వర్గాల ప్రజలకు వివరించుకునే అవకాశం గౌరవ సభ్యులకు ఏర్పడుతుందన్నారు. గౌరవ సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేందుకు, వారి ఫిటిషన్లను సత్వరమే పరిష్కరించేందుకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక యాప్ అమల్లోకి వచ్చిందన్నారు. అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక యాప్ ను సాద్యమైనంత త్వరగా అమల్లోకి తేవాలని వారు కోరారు. క్షేత్ర స్థాయిలో గౌరవ సభ్యుల ప్రొటోకాల్ అమలు విషయంలో పలు ఫిర్యాధులు వస్తున్నాయని, వారి హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తగు ఆదేశాలను క్షేత్ర స్థాయి అధికారులకు జారీచేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు వారు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News