ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’(Pushpa 2) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న ఈ మూవీ ఇప్పటివరకు రూ.1871 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. అయితే ‘దంగల్’ మూవీ కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.2వేల కోట్లు రాబట్టింది.
ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌కు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇక మూడు రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
