యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దంపతులు వెళ్లారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. పవన్‌తో పాటు ఆయన పెద్ద కుమారుడు అకీరా నందన్, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
- Advertisement -
కాగా జనవరి 13 నుంచి ప్రారంభమైన మహా కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు మాత్రమే కుంభమేళా జరగనుంది. 144 ఏళ్లకు ఓసారి వచ్చే కుంభమేళా కావడంతో ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.