Saturday, February 22, 2025
HomeTS జిల్లా వార్తలుకామారెడ్డిKamareddy: ఖాకీలూ.. డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే

Kamareddy: ఖాకీలూ.. డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే

డ్రైవింగ్ క్లాసులు

ఖాకీలకు డ్రైవింగ్ తప్పకుండా రావాలి, అప్పుడే ఎమర్జెన్సీల్లో విధులకు తక్షణం హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లాలో పోలీసులకు డ్రైవింగ్ క్లాసులు ఏర్పాటు చేయించారు ఎస్పీ సింధు శర్మ. పోలీస్ సిబ్బందికి అందరికీ డ్రైవింగ్ వస్తే అత్యవసర పరిస్థితుల్లో ఘటనా స్థలానికి చేరుకోవటం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆరు వారాల పాటు మోటార్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తరగతులు వారి సబ్ డివిజన్లలో ఏ ఆర్ హెడ్ క్వార్టర్ లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోలీస్ శాఖలోని మహిళా పోలీసు కానిస్టేబుల్స్ కు కూడా డ్రైవింగ్ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో కొత్తగా విధుల్లోకి చేరిన మొత్తం 189 పోలీసు కానిస్టేబుల్స్ కూడా ఈ డ్రైవింగ్ క్లాసులు అటెండ్ అవుతున్నవారిలో ఉన్నారు.

- Advertisement -

విడతలవారిగా ట్రైనింగ్

పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారికి డ్రైవింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, చాలామందికి వాహన డ్రైవింగ్ సరిగ్గా రాక, రహదారి భద్రత నియమ నిబంధనలు తెలియక రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని అందుకే అందరికీ విడతల వారీగా డ్రైవింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో 75 మంది పోలీసు కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తిచేసుకున్నారు. మిగతా వారికి కూడా డ్రైవింగ్ పై పూర్తి పట్టు వచ్చేలా ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేయటం విశేషం. మహిళా కానిస్టేబుల్స్ తో జిల్లాలో ప్రత్యేకంగా క్విక్ రియాక్షన్ టీం క్యూఆర్టి ఏర్పాటు అయిన నేపథ్యంలో వీరికి కూడా ట్రైనింగ్ సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News