రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను మంగళవారం ఆలయ ఈఈ రాజేష్ తో కలిసి టౌన్ సీఐ వీరప్రసాద్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎస్పి అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు భద్రతా నేపథ్యంలో పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు.

శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ టెంపుల్, లడ్డు కౌంటర్, ఉచిత టిఫిన్, ఉచిత అన్నదానం, పార్కింగ్, క్యూలైన్స్,కోడె క్యూలైన్, కళ్యాణకట్ట తో పాటు ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించామని ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ పేర్కొన్నారు. వారి వెంట డి ఈ మహిపాల్ రెడ్డి, ఏఈ రామ్ కిషన్ రావు, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
