Saturday, February 22, 2025
Homeనేషనల్AP Tourism: ఏపీకి కొత్త పర్యాటక ప్రాజెక్టులు

AP Tourism: ఏపీకి కొత్త పర్యాటక ప్రాజెక్టులు

కేంద్ర సహకారం

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీకి మరిన్ని పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులను కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడ నుండి ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సాయంత్రం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు శాస్కి స్కీమ్ ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందుకు స్వయంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

సానుకూలంగా స్పందించిన కేంద్రం

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి సంబంధించిన పలు పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. నూతన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని వస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ క్రమంలో దేశంలో ఏర్పాటు చేయనున్న బుద్ధిస్ట్ సర్క్యూట్ లో భాగంగా ఏపీకి ఒక సర్క్యూట్ కేటాయిస్తామని తెలిపారన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్ ఏపీలో ఏర్పాటు చేయమని మంత్రి దుర్గేష్ అడగగా అందుకు కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్, లలిత కళా అకాడమీ ఏర్పాటు, జీవీఆర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో కళాక్షేత్ర ఆడిటోరియం, సాహిత్య అకాడమీ రీజినల్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దుర్గేష్ ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారన్నారు.

మీవాళ్లు మంచి విజన్ ఉన్న లీడర్స్

శ్రీశైలం మెగా టూరిజం హబ్, సూర్యలంక బీచ్,మచిలీపట్నం, నెల్లూరు మైపాడ్ బీచ్ లు అభివృద్ధి, మంగళగిరి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, శ్రీకాకుళంలోని అరసవిల్లి దేవాలయం, నెల్లూరులోని వేదగిరి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను కేంద్ర మంత్రికి వివరించారు. అరకులో నేషనల్ అడ్వెంచర్ అకాడమీ, గుంటూరులో ఫుడ్ క్రాఫ్ట్ ఇన్ స్టిట్యూట్, అమరావతిలో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్, తిరుపతి ఐఐటీలో టూరిజం స్టార్టప్స్ కోసం ఇంక్యూబేషన్ సెంటర్ తదితర అంశాలను వెల్లడించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించనట్లు తెలిపారు. త్వరలోనే ఏపీకి పర్యాటక ప్రాజెక్టులు కేటాయించి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పర్యాటకాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మంచి విజన్ ఉన్న నేతలుగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి దుర్గేష్ మంగళవారం బిజిబిజీగా గడిపారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025 ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి దుర్గేష్ రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఎస్ఎటీటీఈ-2025 వేదికగా వివరించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. 
ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా 28 రాష్ట్రాలు, 50 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సమక్షంలో  కూటమి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగానికి కల్పించిన పరిశ్రమ హోదా, నూతన టూరిజం పాలసీ, రాష్ట్రంలో పర్యాటక రంగానికి అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు తదితర వివరాలను వివరించనున్నారు. 
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News