Saturday, February 22, 2025
HomeఆటChampions Trophy: నేటి నుంచి ఛాంపియన్స్ సమరం.. పూర్తి వివరాలు ఇవే

Champions Trophy: నేటి నుంచి ఛాంపియన్స్ సమరం.. పూర్తి వివరాలు ఇవే

వన్డే వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) నేటి నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభంకానుంది. ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. 8 పెద్ద జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చివరగా 2017లో జరిగిన ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇక 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ మెగా టోర్నీ జరుగుతుంది. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది.

- Advertisement -

గ్రూప్ -ఏ లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్ -బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో మ్యాచ్‌లన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ -18 టీవీ ఛానెల్స్, జియో హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడొచ్చు. ఈ ట్రోఫీ ఫ్రైజ్‌మ‌నీ మొత్తం రూ.60కోట్లు. విజేత జట్టుకు రూ.19కోట్ల 47లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.9కోట్ల73లక్షలు, సెమీఫైనల్ చేరిన జట్లకు 5లక్షల 60వేల డాలర్లు రూ.4కోట్ల 86లక్షలు అందుతాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇలా..

♦ ఫిబ్రవరి 19- పాకిస్తాన్ vs న్యూజిలాండ్ ( కరాచీ)
ఫిబ్రవరి 20 – బంగ్లాదేశ్ vs భారత్ ( దుబాయ్)
♦ ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా (కరాచీ)
♦ ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (లాహోర్)
ఫిబ్రవరి 23 – పాకిస్తాన్ vs భారత్ (దుబాయ్)
♦ ఫిబ్రవరి 24 – బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి)
♦ ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (రావల్పిండి)
♦ ఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (లాహోర్)
♦ ఫిబ్రవరి 27- పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి)
♦ ఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (లాహోర్)
♦ మార్చి 1- దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (కరాచీ)
మార్చి 2- న్యూజిలాండ్ vs భారత్ (దుబాయ్)
♦ మార్చి 4 (సెమీ ఫైనల్-1) – దుబాయ్.
♦ మార్చి 5 (సెమీ ఫైనల్ 2) – లాహోర్
♦ మార్చి 9 (ఫైనల్) – లాహోర్/దుబాయ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News