భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)గా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ కుమార్ పదవికాలం నేటితో ముగియడంతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. జనవరి 26, 2029 వరకు ఆయన సీఈసీగా కొనసాగనున్నారు. 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారైన జ్ఞానేష్.. గతంలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేశారు.
కాగా సోమవారం అర్థరాత్రి సమయంలో జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం నియమించింది. అయితే ఆయన నియమాకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. హడావిడిగా అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటని నిలదీసింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో సీఈసీ నియామకం ప్యానెల్ అభ్యంతరాల పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుందిత.