Thursday, September 19, 2024
HomeదైవంSrisailam: ఉగాది ఉత్సవాలకు పోటెత్తనున్న భక్తజనం

Srisailam: ఉగాది ఉత్సవాలకు పోటెత్తనున్న భక్తజనం

శ్రీశైలం మహా క్షేత్రంలో మార్చి 19వ తేదీ నుండి 23 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భముగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా సౌకర్యాలు కల్పించే విషయమై చర్చించేందుకు పరిపాలనా భవనములో సమావేశం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్చంద సేవాసంస్థల భక్తబృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఇప్పటికీ ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులతో ఈ నెల 5వ తేదీన బాగల్ కోట్ జిల్లా రబ్మవిలో మొదటి
సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
కాగా ఈ నాటి సమావేశంలో బాగల్ కోట్, తుముకూరు, బీజాపూర్ (విజయపుర), బెళగావి, బసవన బాగేవాడి తదితర ప్రాంతాలు మరియు మహారాష్ట్రలోని షోలాపూర్, అక్కల్కోట్ ప్రాంతాలకు చెందిన సుమారు 30 భక్త బృందాలు, పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సుదీర్ఘముగా జరిగిన ఈ సమావేశములో ఉత్సవ సంబంధించిన పలు అంశాలు కూలంకుషంగా చర్చించారు.

- Advertisement -

స్పర్శదర్శనానికి అవకాశం లేదు..
ఉగాది ఉత్సవాలలో అయిదురోజులపాటు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటాయని తెలిపారు. ఉత్సవాల రోజులలో శ్రీ స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉందడని పేర్కొంటూ, ఈ విషయములో భక్త బృందాల ప్రతినిధులు భక్తులలో అవగాహన కల్పించాలన్నారు.
స్వచ్ఛంద సేవకుల సేవలు..
ఉగాది మహోత్సవాలలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ స్వచ్చంద సేవకులు స్వామివారి ఆలయం, ముఖమండపం, నంది మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శనం ఉచిత క్యూలైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగాభవాని స్నానఘట్టాలు, పాతాళగంగ హఠకేశ్వరం, సాక్షిగణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, తాత్కాలిక సమాచార కేంద్రాలు తదితర చోట్ల ఆయా సేవలను అందించవలసి ఉంటుంది.. స్వచ్ఛంద సేవకులు అందరు కూడా మార్చి 19 నుండి 23 వరకు ఆయా సేవలు అందిస్తారు.

లాటరీ ద్వారా సేవా ప్రదేశాల కేటాయింపు
స్వచ్చంద సేవకులకు సేవా ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గతంలో వలెనే లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలను కేటాయించారు. సమావేశంలో హాజరైన స్వచ్ఛంద సేవకుల చేతుల మీదుగానే ఈ లాటరీ ప్రక్రియ చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News