Saturday, February 22, 2025
Homeచిత్ర ప్రభRishab Shetty: 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌'గా రిషబ్ శెట్టి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Rishab Shetty: ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌’గా రిషబ్ శెట్టి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) ‘కాంతార’ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవైపు కాంతార ప్రీక్వెల్ సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర భారీ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్”(CHHATRAPATI SHIVAJI MAHARAJ) సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి మేకర్స్ ప్రకటించారు. ఇవాళ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది.

- Advertisement -

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘చావా’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శివాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి ఎలా నటిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News