ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదారాబాద్ బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఆయనకు కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. తన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సబ్మిట్ చేసి సాధారణ పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారు. అనంతరం పాస్‌పోర్టు కార్యాలయం నుంచి నేరుగా నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లి పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా వచ్చె నెలలో అమెరికాలో ఉంటున్న తన మనవడు హిమాన్షు వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొన్ని రోజులు మనవడితో సరదాగా గడిపేందుకు గాను పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.