ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించడంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Jagan)పై రాష్ట్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసినట్లు సమాచారం. త్వరలో కృష్ణా-గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనునన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దీంతో ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సభలు, ర్యాలీలు నిషేధం. కానీ గుంటూరు మిర్చి యార్డుకు ర్యాలీగా వెళ్లిన జగన్.. అక్కడి రైతులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ గుంటూరు పర్యటనకు ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ ఆయన గుంటూరు చేరుకుని రైతులతో భేటీ అయ్యారు. తమ ఆదేశాలు బేఖాతరు చేసినందుకు ఎన్నికల కమిషన్, పోలీసులు విడివిడిగా జగన్‌పై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడిన జగన్ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించినా కనికరం చూపడం లేదు అని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపటానికి తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్బీకేలు, ఈ క్రాప్‌లు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు కనిపించటం లేదని విమర్శించారు. తమ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతుల పంటలు కొనుగోలు చేశాయమన్నారు. రైతులు గోడు పట్టించుకోకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని జగన్ హెచ్చరించారు.

