Saturday, February 22, 2025
Homeచిత్ర ప్రభFamily entertainer: సంతాన ప్రాప్తిరస్తులో ఫుల్ కామెడీ..

Family entertainer: సంతాన ప్రాప్తిరస్తులో ఫుల్ కామెడీ..

సాఫ్ట్వేర్ ఇంజినీర్ సుబ్బు ఫ్రస్టేషన్

మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి అభినవ్ గోమటం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ‘సుబ్బు’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

- Advertisement -

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.

ఈ రోజు “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి అభినవ్ గోమటం నటించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మాట్రిమోని ప్రొఫైల్స్ ఉన్న ఫ్రస్టేటెడ్ అన్ మారీడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు పాత్రలో అభినవ్ గోమటం ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నారు. సుబ్బు ఫ్రస్టేషన్ ఏ స్థాయిలో కామెడీ పండించిందో థియేటర్స్ లో చూడాల్సిందే.

ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News