ఫోన్ ట్యాపింగ్(Phone Tappng) కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)కు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై స్టే విధించింది. తదుపరి విచారణ చేపట్టే వరకు హరీశ్‌రావుతో పాటు రాధాకిషన్ రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -
కాగా తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో హరీశ్‌రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారులకు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం విధితమే. ఇక ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నారు.