Saturday, April 19, 2025
HomeఆటChampions Trophy: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్..!

Champions Trophy: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్..!

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్ ఉంచారు. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ (107) పరుగులు చేయగా, టామ్ లాథమ్ (118) సెంచరీలతో చెలరేగారు. ఇక ఆల్ రౌండర్ ఫిలిప్స్ (61) అర్ధ సెంచరీతో రాణించడంతో.. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 320/5 పరుగులు చేసింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రారంభంలోనే న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. డేవాన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచేల్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఒక దశలోనే 73 పరుగులకే మూడు వికెట్లు కోల్పోడంతో.. పాకిస్తాన్ పైచేయి సాధించినట్టే అనిపించింది. అయితే విల్‌ యంగ్‌, టామ్‌ లాథమ్‌ లు కివీస్ ను ఆదుకున్నారు. ఇద్దరు సెంచరీలతో కదం తొక్కారు. దాంతో న్యూజిలాండ్‌ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది.

విల్‌ యంగ్‌ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో 107 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత టామ్‌ లాథమ్‌, గ్లెన్‌ ఫిలిప్‌ స్కోరును పరుగెత్తించారు. ఈ క్రమంలోనే లాథమ్‌ సైతం సెంచరీ చేయగా.. ఫిలిప్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యంగ్-లాథమ్ జోడీ నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లాథమ్‌-ఫిలిప్‌ జోడీ సైతం ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. లాథమ్‌ 103 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫిలిఫ్‌ 39 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, హరీస్‌ రవుఫ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్‌ అహ్మద్‌కు ఒక వికెట్‌ దక్కింది.

న్యూజిలాండ్ తరఫున చాంపియన్స్‌ ట్రోఫీలో సెంచరీ చేసిన నలుగురు బ్యాట్స్‌మెన్‌లలో యంగ్‌ చోటు సంపాదించాడు. గతంలో నాథన్‌ ఆష్లే, క్రిస్ కైర్న్స్, కేన్ విలియమ్సన్ కివీస్ జట్టు తరపున ఈ ఘనత సాధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News