Saturday, February 22, 2025
Homeనేషనల్Mahakumbh 2025 : కుంభమేళాలో ట్రంప్, కిమ్, మస్క్.. అబ్బా ఏం వాడకం రా సామి..!

Mahakumbh 2025 : కుంభమేళాలో ట్రంప్, కిమ్, మస్క్.. అబ్బా ఏం వాడకం రా సామి..!

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ప్రత్యేక మహా కుంభమేళా జనవరి 13న మొదలు కాగా, ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకూ 45 రోజుల్లో 50 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈసారి విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాకు చేరుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున మూడు కోట్లకు పైగా ప్రజలు స్నానమాచరించారని చెబుతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే తాజాగా మహాకుంభమేళా AI జనరేటెడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను మహా కుంభమేళాలో చూపించారు. AI వీడియోలో ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్, కిమ్, మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, విల్ స్మిత్, రిషి సునక్, జెండయా, టామ్ హాలండ్, జాన్ సెనా, జస్టిన్ ట్రూడో వంటి ప్రముఖులు పవిత్ర స్నానం చేస్తున్నట్లు కనిపించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అబ్బాబా ఏం వాడకంరా స్వామి మీది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో సంగంలో స్నానం చేస్తున్నట్లు మొదటగా చూపించారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దీనికి సెలబ్రిటీలు మహాకుంభ ప్రయాగ్‌రాజ్‌లో అనే క్యాప్షన్ ఉంది. దీనికి ఇప్పటివరకు లక్షల కొద్దీ లైక్‌లు వచ్చాయి. అలాగే ఆ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చాలా మంది దీనికి ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి AIని మనోళ్లు ఘోరంగా వాడేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News