వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 15 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు 1,69,76,867 రూపాయలు, బంగారం 116 గ్రాముల 000 మిల్లి గ్రాములు, వెండి 09 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వినోద్ తెలిపారు.
- Advertisement -
ఈ హుండీ లెక్కింపులో ఎస్పీఎఫ్ హోమ్ గార్డు సిబ్బంది భద్రత మధ్య నిర్వహించారు. ఈ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివ రామకృష్ణ భజన మండలి సేవా పాల్గొన్నారు.
