Monday, April 14, 2025
HomeతెలంగాణSuryapetaపెద్దగట్టు జాతరలో మంత్రి వెంకటరెడ్డి

Suryapetaపెద్దగట్టు జాతరలో మంత్రి వెంకటరెడ్డి

లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లికి పూజలు

పెద్దగట్టు దురాజ్ పల్లిలో ఘాట్ రోడ్డులు, గెస్ట్ హౌస్ లు నిర్మించి మరింత అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలతో కలిసి సందర్శించి లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లికి మొక్కులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. పదేండ్ల తర్వాత తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వచ్చింది, పేదవాండ్లకు ఇళ్లు కట్టించే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నా అన్నారు.

- Advertisement -

కుటుంబ పాలనతో దోపిడీ
పదేండ్లు కుటుంబ పాలనతో తెలంగాణ దోపిడికి గురైంది. అందుకే నల్లగొండ ప్రజలు ఒక్కో చోట 50-60 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించారు. మేడారం జారత తర్వాత అతిపెద్ద రెండో జాతర దాదాపు 40 లక్షల మంది దర్శించుకుంటారు. 60 కోట్ల రూపాయలతో దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌజులు నిర్మిస్తామని అన్నారు. ఎస్.ఎల్.బీ.సీ, బ్రహ్మణవెల్లంల, శ్రీరాంసాగర్ కాలువలు తియ్యలే సూర్యపేటకు నీళ్లు ఇయ్యలే, గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చెయ్యక ఆలేరును ఎండబెట్టారు. అధికారం పోయినంక దురాజ్ పల్లి గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు.

జగన్ తో ములాఖత్ అవ్వలా?

జగదీష్ రెడ్డికి ప్రజల్ని చూసే ఓపిక లేదు, ఆయనకు డబ్బు తప్పా మరో యావలేదు లక్ష రుణ మాఫీని 5సార్లు చేసినోళ్ల రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకుపోయేందుకు జగన్ తో కలిసి ములాఖత్ అయ్యింది కేసిఆర్. కేసిఆర్ విద్యను, నిరుద్యోగలను మోసం చేస్తే మేం వచ్చి ఉద్యోగాలు నింపుతున్నం, స్కిల్ సెంటర్స్ పెడుతున్నం. తెలంగాణలో ఇరవై యేండ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారమని అన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, వేనారెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News