భారత క్రికెట్ జట్టు(Team India) ఇప్పటికే ఎన్నో రికార్టును తన ఖాతాలో వేసుకుంది. ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టు పరంగానూ అనేక రికార్డులు సొంతం చేసుకుంది. తాజాగా మరో రికార్డును బ్రేక్ చేసింది. అయితే ఇది టాస్‌లు ఓడిపోవడంలో. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడంతో వన్డేల్లో వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ జట్టు రికార్డును సమం చేసింది.
మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 మధ్య నెదర్లాండ్స్ వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది. ఇప్పుడు భారత జట్టు కూడా 2023 నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటివరకు 11 సార్లు టాస్ ఓడిపోయింది. 2024లో దక్షిణాఫ్రికా, శ్రీలంకతో జరిగిన 6 వన్డేలు, ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ టాస్ గెలవలేదు. తాజా మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవడంతో నెదర్లాండ్స్ రికార్డును సమం చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ ఓడిపోతే ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసి తొలి జట్టుగా అవతరించనుంది.
ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ విషయానికొస్తే 39 పరుగులకే ఐదు వికెట్లు తీసిన భాతర బౌలర్లు తర్వాత తడబడ్డారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జాకీర్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ వదిలేయడం మైనస్ అయింది. ఆ క్యాచ్ నుంచి తప్పించుకున్న జాకీర్ హాఫ్ సెంచరీతో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ప్రస్తుతం బంగ్లా 40 ఓవర్లలో 165/5 పరుగులు చేసింది.