పేమెంట్ యాప్ గూగుల్ పే(Google pay)యూజర్లకు షాక్ ఇచ్చింది. విద్యుత్, గ్యాస్ వంటి బిల్ పేమెంట్లపైనా ఛార్జీలు వసూలు చేస్తోంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై కన్వీనియన్స్ ఫీజు ఛార్జ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే యూపీఐ లావాదేవీలకు మాత్రం ఈ ఛార్జీలు వర్తించవు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే సంస్థలు ఛార్జ్ వసూళ్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల క్రెడిట్ కార్డ్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించిన ఓ యూజర్ నుంచి రూ.15 కన్వీనియన్స్ ఫీజు రూపంలో గూగుల్ పే వసూలు చేసినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీంతో ఈ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే ఛార్జీల వసూలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై గూగుల్ పే అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ సంస్థలు ఫ్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.