Sunday, February 23, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Wedding book: వెడ్డింగ్ కార్డ్ కాదుకాదు పెళ్లి పుస్తకం @ 32 పేజెస్

Wedding book: వెడ్డింగ్ కార్డ్ కాదుకాదు పెళ్లి పుస్తకం @ 32 పేజెస్

పెళ్లి పుస్తకం

ఈ వెడ్డింగ్ కార్డు చూస్తే ..ఇది పెళ్లి పత్రికా లేక పెళ్లి పుస్తకమా అనటం ఖాయం. ఎందుకంటే ఈ పెండ్లి పత్రిక 32 పేజీలుంది మరి. పెండ్లిలో జరిగే 32 తంతులను వివరిస్తూ పుస్తకం రూపంలో ఆహ్వాన పత్రికగా అచ్చువేసి పెళ్లి పిలుపులు చేశారు. సో ఈ వెడ్డింగ్ కార్డ్ అంత వైరల్ అయింది.

- Advertisement -

పెళ్లంటే పందిళ్లు, చప్పట్లు, సందెళ్లు.. మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు అనే పాట కాదు కానీ ఈ పెళ్లి పత్రిక చూసినవాళ్లు మాత్రం ఇకమీదట.. పెళ్లంటే గ్రాండ్ వెడ్డింగ్ కార్డ్ కూడా అని చెప్పుకోవాల్సిందే. తమ పెళ్లి వేడుకను కలకాలం గుర్తుండేలా చేయాలని భావించిన వధువు తల్లిదండ్రులు అనుకున్నదే తడువుగా పెళ్లి చూపుల నుండి వధువును అత్తారింటికి పంపే వరకు కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ 32 పేజీలతో పుస్తక రూపంలో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి అందరి దృష్టి ఆకర్షించారు.

పత్రిక అందరూ పుస్తకంలా దాచుకునేలా..

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్-శ్రీదేవి దంపతులు తమ కూతురు రవళిక వివాహం సందర్భంగా 32 పేజీలతో వివాహ విశిష్టతను తెలియజేసేలా ఏకంగా పుస్తకాన్ని ముద్రించి అతిథులను ఆహ్వానిస్తున్నారు. వివాహానికి సంబంధించిన కల్యాణ సంస్కృతి, పెళ్లి చూపులు, పాణిగ్రహణ శుభ ముహూర్త పత్రిక, పెండ్లి కుమార్తెను చేయడం, పెండ్లి కుమారుడిని చేయడం, వరపూజ, వధువును గంపలో తేవడం, తెరసాల, కన్యాఫలం, మాంగల్య పూజ, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి సప్తపది, ఉంగరాలు తీయించడం, అప్పగింతల పాటతో పాటు పెండ్లిలో జరిగే 32 తంతుల గురించి ఒక్కో పేజీలో ముద్రించి తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వాన పత్రిక అందుకున్న ప్రతి ఒక్కరు మరుగున పడుతున్న మన సాంప్రదాయాన్ని ఇలా వివాహ పత్రిక రూపంలో ముద్రించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News