టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)కి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. కోల్‌కతాలో ఆయన ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్సప్రెస్ రహదారిపై దంతన్ పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కు అడ్డుగా రావడంతో దాదా కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.
ఇటీవల గంగూలీ కూతురు సనా గంగూలీ కూడా రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. సనా ముందు సీట్లో కూర్చున్నప్పటికీ, ఆమె డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పెను ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమార్తెలు రోడ్డు ప్రమాదాలకు గురికావడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.