ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కుటుంబ సమేతంగా వెళ్లిన సంగతి తెలిసిందే. సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
అయితే కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫొటోలు కొంతమంది మార్ఫింగ్ చేశారు. దీనిపై తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లలో జనసైనికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మార్ఫింగ్ చేసిన వారిపై BNS సెక్షన్లు 353(2), 356(2) కింద క్రైమ్ నంబర్లు 11, 12, 13, 14లలో సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం, చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు అయింది. ఐపీ అడ్రసుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.