సోషల్ మీడియాలో తన తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాలను నటుడు మెగాస్టార్ (Mega Star Chiranjeevi) చిరంజీవి ఖండించారు. ఈ సందర్భంగా ఈ అవాస్తవాలపై స్పందిస్తూ ‘మా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారని దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మా అంజనాదేవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అంజనాదేవిపై శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు చిరంజీవి “ఎక్స్’ లో పెట్టిన పోస్టుతో తెరపడింది. అయితే అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయద్దని విజ్ఞప్తి చేశారు. మరో వైపు ఈ కథనాలపై చిరంజీవీ టీం స్పష్టత ఇచ్చింది.
సాధారణ ఆరోగ్య పరీక్షల్లోనే భాగంగా గతవారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.