టోల్ ఫీజు పేమెంట్స్‌ను వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం స్మార్ట్ సొల్యూషన్ అయిన ఫాస్టాగ్ (FASTags)ను ప్రవేశపెట్టింది. అయితే, చాలా మంది వాహనదారులు తమ ఫాస్టాగ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నియమాల ప్రకారం, ఫాస్టాగ్‌లు తప్పనిసరిగా KYC (నో యువర్ కస్టమర్) రిక్వైర్‌మెంట్స్‌కి అనుగుణంగా ఉండాలి. మీ KYC వివరాలు గడువులోగా అప్‌డేట్ చేయకపోతే, ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుంది లేదా బ్లాక్‌లిస్ట్‌లో చేరుతుంది.
ఇంకా, “ఒక వాహనం, ఒక ఫాస్టాగ్” నియమం ప్రకారం, ఒకే వాహనానికి ఒక ఫాస్టాగ్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఒక వాహనానికి మల్టిపుల్ ఫాస్టాగ్‌లను లింక్ చేసినట్లయితే, KYC పూర్తి అయిన తర్వాత ఒక్కటే యాక్టివ్‌గా ఉంటుంది, మిగతా ఫాస్టాగ్‌లు డీయాక్టివేట్ అవుతాయి. ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ కావడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి.
మొదటిగా, అధికారిక NHAI ఫాస్టాగ్ పోర్టల్ https://fastag.ihmcl.com కు వెళ్లండి. మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ చేసి, ఫాస్టాగ్ స్టేటస్ చెక్ చేసుకోండి. అవసరమైతే, KYC వివరాలను అప్‌డేట్ చేయండి. ఇంకా, NETC ఫాస్టాగ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి. బ్యాంక్ ఫాస్టాగ్ పోర్టల్‌కి లాగిన్ అయి స్టేటస్ చెక్ చేసుకోండి.
మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే, అది పర్మనెంట్‌గా బ్లాక్ అయితే తిరిగి యాక్టివేట్ కాకపోవచ్చు. కానీ, బ్యాలెన్స్ లేకపోతే, దాన్ని రీఛార్జ్ చేసి మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ రీఛార్జ్ చేయాలంటే, మీ అకౌంట్‌లో ఫండ్స్ యాడ్ చేసి, అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ, ఫాస్టాగ్ పర్మినెంట్‌గా బ్లాక్‌లిస్ట్ అయితే, మీరు NHAI పోర్టల్ లేదా ఆథరైజ్డ్ బ్యాంకు ద్వారా కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాలి. అయితే, అప్లికేషన్ సమయంలో మీ KYC వివరాలు అప్‌డేటెడ్‌గా ఉండాలి.
మరొక ముఖ్యమైన విషయం, “వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్” రూల్‌కి అనుగుణంగా, ఒకే వాహనానికి మల్టిపుల్ ఫాస్టాగ్స్ వాడడం వల్ల సమస్యలు రావచ్చు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, మిగతా ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేయాలి. వేరే బ్యాంక్ ద్వారా ఫాస్టాగ్ జారీ చేసుకుంటే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా సహాయం కోసం బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్ సాధారణంగా ఫాస్టాగ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ చర్యలు తీసుకుంటే మీ ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవచ్చు, ప్రయాణాల సమయంలో ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది.