SLBC టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా వెలికితీసే సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. సహాయక సామాగ్రితో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మిలటరీ బృందంతో కలిసి టన్నెల్ లోకి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ స్వరంగం శనివారం ఉదయం 8 గంటలకు అనుకోకుండా స్వరంగా మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద రిటైనింగ్ వాల్ కడుతుండగా పెద్ద శబ్దంతో సుమారు మూడు మీటర్ల మేర కృంగిపోయింది. దీంతో స్వరంగంలో పనుల కోసం వెళ్లిన 50 మంది కూలీలలో పదిమందికి స్వల్ప గాయాలు కాగా 32 మంది సురక్షితంగా బయటికి రాగా వివిధ రాష్ట్రాలకు చెందిన మనోజ్ కుమార్(p.E) ఉత్తర ప్రదేశ్ శ్రీనివాస్ ఉత్తర ప్రదేశ్(F.E) సందీప్ సాహూ(కార్మికుడు) జార్ఖండ్ జటాక్స్( కార్మికుడు)ఝార్ఖండ్ సంతోష్ సాహూ(కార్మికుడు) జార్ఖండ్ మనూజ్ సాహూ(కార్మికుడు) జార్ఖండ్ సన్నీ సింగ్(కార్మికుడు) జమ్మూ కాశ్మీర్ గురుప్రీత్ సింగ్ (కార్మికుడు) పంజాబ్ ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకుపోయారు.

1..మనోజ్ కుమార్ (PE) ఉత్తర ప్రదేశ్
2.. శ్రీనివాస్ (FE) ఉత్తర ప్రదేశ్
3.. సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4.. జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5..సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6.. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7..సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8.. గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్
టన్నల్ లో చిక్కుకున్న కార్మికుల ఫోటో

టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం అకస్మాత్తుగా లోపటికి నీరు, మట్టి 8 కిలోమీటర్ల మేర రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావించాల్సి ఉందన్నారు. రోజువారీగా పని మొదలు పెట్టినట్లే ఈ ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాలలోనే ఈ సంఘటన ఉత్పన్నమౌడంతో వెంటనే నిర్వాహకులు పనిని నిలిపి వేసి బయటకు రావడంతో పాటు వీలున్నంత వరకు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారన్నారు. సహాయక చర్యలపై ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో సమీక్షించిన రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు.










