ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి జి.నాగేందర్ రెడ్డి ఆదేశాలతో మధిర ఎక్సైజ్ సిఐ జె. రామ్మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేపట్టగా సుమారు 8 కిలోల గంజాయి బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అనుమానం వచ్చి బ్యాగ్ చూస్తే..
ట్రైన్లో రెండు బ్యాగులు అనుమానస్పదంగా కనిపించగా ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించినారు. ఈ గంజాయి బరువు సుమారు 8 కిలోలు ఉంది. తనిఖీల్లో పాల్గొన్న అధికారులు ఎక్సైజ్ సిఐ జె.రామ్మూర్తి , ఎస్సై జనార్దన్ రెడ్డి, సిబ్బంది రజాలి,రియాజ్ , ముస్తఫా నాగరాజు ఉన్నారు. మధిర ఎక్సైజ్ పరిధిలో నాటు సారా, మాదకద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని తెలిపారు.