ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలి, వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపరాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపద్దు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదు అనే నినాదాలు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ రోడ్డు మీద నిలబడ్డ యువకులు సమాజానికీ, వాహనదారులకు మంచి సందేశం తెలియ జేస్తున్నారు.
ఏదో సమాజానికి మంచి చేసే పని చేస్తున్నారని వీరిని అభినందించద్దు, వీళ్లు నేరం చేశారు కాబట్టి ఇలా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కొలిమిగుండ్ల మండలంలో వివిధ గ్రామాల్లో న్యూసెన్స్ చర్యలకు పాల్పడిన ఐదుగురు యువకులపై కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల న్యూసెన్స్ కేసులు నమోదు అయ్యాయి. న్యూసెన్స్ చర్యలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న వీరికి ఇలా కోర్టు శిక్షించింది. సమాజంలో న్యూసెన్స్ చర్యలకు పాల్పడుతున్న వీరికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నారు.