Sunday, February 23, 2025
HomeNewsSrisailam: గవర్నర్ శ్రీశైల పర్యటనకు ఏర్పాట్లు

Srisailam: గవర్నర్ శ్రీశైల పర్యటనకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 24, 25 వ తేదీలలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం శ్రీశైలం విచ్చేస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సున్నిపెంట హెలిపాడ్ మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 24, 25 వ తేదీలలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం శ్రీశైలం విచ్చేస్తున్న సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్ధం చేసిన సున్నిపెంట హెలిప్యాడ్ మైదానాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ చుట్టూ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలని ఆర్ అండ్ బి, అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు. కాన్వాయ్ వెంట మంచి కండిషన్ గల వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. భ్రమరాంబా అతిథిగృహంలో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర గవర్నరుకు వసతి, అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లను చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి సూచించారు. కాన్వాయ్ వెంట, దేవస్థాన పరిధిలో అగ్నిమాపక వాహనాలు, సిబ్బందితో సహ సిద్ధంగా ఉంచుకోవాలని అగ్నిమాపక సిబ్బందిని ఆదేశించారు. హెలిప్యాడ్ సమీపంలో మెడికల్ క్యాంప్, అంబులెన్స్, కార్డియాలజిస్ట్ తో పాటు నైపుణ్యం గల డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని డిఎం అండ్ హెచ్.ఓ, డిసిహెచ్ ఎస్, నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు.

రాష్ట్ర గవర్నరు పర్యటించే ప్రదేశాలలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని డిపిఓను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపిఎస్‌పిడిసిఎల్‌ వారిని కలెక్టర్ ఆదేశించారు. ఆహార పదార్థాలలో కలుషితం లేకుండా పరీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దేవస్థానములో సంప్రదాయాలను అనుసరించి రాష్ట్ర గవర్నరకు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల దర్శనాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారిని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News